పదవులు నేనెప్పుడూ కోరుకోలేదు …
పదవులు నేనెప్పుడూ తాను కోరుకోలేదని, అవే తనను వెతుక్కుంటూ వచ్చాయని ఉపరాష్ట్రపతి అభ్యర్థి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. హైదరాబాద్లో వెంకయ్యనాయుడికి ఏర్పాటు చేసిన ఆత్మీయ అభినందన సభలో ఆయన మాట్లాడారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమన్వయంతో పని చేయాలని తాను కోరానని దానికి ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రులు అంగీకరించారని తెలిపారు. మనం ప్రత్యర్థులం మాత్రమేనని, శత్రువులం కాదన్నారు. చిన్నతనంలోనే తనను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని చేసిందన్నారు. కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు పార్టీ జాతీయ అధ్యక్షుడిగా చేసిందని తెలిపారు. పార్టీని వీడేటప్పుడు కన్నీటి పర్వంతమయ్యానని, ప్రధాని మోదీ ఓదార్చారని తెలిపారు. 2020లో రాజకీయాల నుంచి తప్పుకుని సామాజిక సేవలో నిమగ్నమవ్వాలని గతంలోనే నిర్ణయించుకున్నామని సృష్టం చేశారు. తన రాజకీయ జీవితంతో కుటుంబం నుంచి ఎలాంటి ఒత్తిడి ఎదుర్కోలేదన్నారు. పిల్లలు నాపై ఆధారపడకుండా వారి కెరీర్ను చక్కదిద్దుకున్నారని, తన పదవులు అడ్డం పెట్టుకుని వారు లబ్ధి పొందలేదని పేర్కొన్నారు.













