ఢిల్లీలో బోనమెత్తిన వెంకయ్యనాయుడు
ఢిల్లీలోని తెలంగాణభవన్‌లో మహంకాళి అమ్మవారి బోనాల వేడుకలు కన్నుల పండువగా జరిగాయి. ఈ వేడుకలకు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వం తరుపున అమ్మవారికి పట్టు వస్త్రాలను ఆయన సమర్పించారు. ఆ తర్వాత బోనమెత్తి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ ఈ ఉత్సావాన్ని ఢిల్లీలో ఘనంగా నిర్వహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి, ఆలయ కమిటీకి, అధికారులకు అభినందనలు తెలిపారు. గత మూడు సంవత్సరాలుగా ఢిల్లీలో బోనాల పండుగ నిర్వహించడం చాలా గొప్ప విషయమని ఆయన పేర్కొన్నారు. మన సంప్రదాయ పండుగలను భవిష్యత్ తరాలకు అందించాల్సిన అవసరం ఉందని అన్నారు.













