ఐదు రోజుల పాటు వేములవాడ దర్శనం బంద్
తెలంగాణలో కరోనా విజృంభణ నేపథ్యంలో వేములవాడ రాజరాజేశ్వర దేవస్థానం అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. గురువారం నుంచి 5 రోజుల పాటు భక్తులకు రాజన్న దర్శనాన్ని నిలిపివేస్తున్నామని ప్రకటించారు. ఈ నెల 18 నుంచి 22 తేదీ వరకూ ఆలయాన్ని మూసేస్తున్నట్లు ప్రకటించారు. కోవిడ్ తీవ్రతను దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. అయితే శ్రీరామ నవమి ఉత్సవాలు మాత్రం ఏకాంతంగా కేవలం అర్చకుల సమక్షంలోనే నిర్వహిస్తామని వెల్లడించారు. స్వామి వారి నిత్య పూజలు, కైంకర్యాలు ఏకాంతంగానే నిర్వహిస్తామని అధికారులు తెలిపారు.













