వరవరరావుకు కరోనా పాజిటివ్
ముంబైలోని తలోజా జైల్లో ఉన్న ప్రజాకవి వరవరరావు కరోనా వైరస్ బారినపడ్డారు. గతకొంత కాలంగా తీవ్ర అనారోగ్యంగా బాధపడుతున్న ఆయనకు గురువారం నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కాగా భీమా కోరేగామ్ కేసులు ఆరోపణలు ఎదుర్కొంటున్న వరవరరావును ఎన్ఐఏ అరెస్ట్ చేసి తలోజా జైలుకు తరలించిన విషయం తెలిసిందే. ఇటీవల కాలంలో ఆయన ఆరోగ్య పరిస్థితి తీవ్రంగా విషమించిందంటూ జైలు అధికారులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఈ నేపథ్యంలో వరవరరావు ఆరోగ్యం క్షీణించడంతో సోమవారం రాత్రి ముంబైలోని జేజే ఆసుపత్రికి తరలించారు. అక్కడ నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా తెలింది. దీంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.













