వందే భారత్ మిషన్‌లో భాగంగా.. హైదరాబాద్ కు 430 మంది భారతీయులు
విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను భారత్‌కు తీసుకొచ్చే వందే భారత్ మిషన్‌లో భాగంగా 430 మంది మూడు దేశాల నుంచి హైదరాబాద్‌కు చేరుకున్నారు. అమెరికాలోని షికాగో నుంచి ఎయిర్ ఇండియా విమానంలో 120 మంది, షార్జా నుంచి ఎయిర్ అరేబియా విమానంలో 170 మంది, జెడ్డా నుంచి ఎయిర్ ఇండియా విమానంలో 140 మంది ప్రయాణికులు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. వారందరికీ వైద్య పరీక్షలు, ఇమిగ్రేషన్ తనిఖీల అనంతరం ప్రత్యేక బస్సుల్లో క్వారంటైన్‌కు తరలించనున్నట్టు అధికారులు తెలిపారు. 55 ఏళ్ల పైడిన వారిని హోం క్వారంటైన్లో ఉంచనున్నట్లు పేర్కొన్నారు.













