టీఆర్ఎస్ ఎమ్మెల్యే వనమా సంచలన వ్యాఖ్యలు
తన కుమారుడు వనమ రాఘవ అరెస్టు, ఆపై జరిగిన పరిణామాలపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ లాబీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రెండు నెలలు అనారోగ్యంతో బాధపడ్డా. నేను లేని సమయంలో నా కుమారుడు రాఘవపై కొందరు కుట్రలు పన్నారు. టీఆర్ఎస్ జిల్లా పార్టీ అధ్యక్షుడు కావలసిన నా కుమారుడి రాజకీయ భవిష్యత్‌ను ఆగం చేశారు. నేను ఆరోగ్యంగా ఉండుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. నియోజకవర్గంలో నిత్యం పర్యటిస్తున్నా, నా కుమారునిపై కుట్రలు చేసిన వారి బండారం త్వరలోనే బయట పెడుతాను. మా పార్టీ వాళ్ళతో పాటు ఇతర పార్టీల వారు కూడా కుమ్మక్కయ్యారు అంటూ ఆరోపించారు.













