సోమశిల, సింగోటం ల టూర్ బ్రోచర్ విడుదల
సోమశిల, సింగోటం ల టూర్ బ్రోచర్ ను విడుదల చేసిన రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ. V. శ్రీనివాస్ గౌడ్ గారు, రాష్ట్ర B C సంక్షేమ శాఖ మంత్రి శ్రీ గంగుల కమలాకర్ గారు.
మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారి కామెంట్స్..
వందల సంవత్సరాల క్రితం కట్టిన దేవాలయాలు గొప్ప చరిత్ర గల ప్రాంతం సోమశిల కు ఉందన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత మూడు రెట్లు టూరిస్టులు ఎక్కువగా తెలంగాణకు వస్తున్నారు. ఇరిగేషన్ రిజర్వాయర్ ల చుట్టుపక్కల టూరిజం ప్రాంతం లు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు..
ఇతర దేశాల టూరిస్టులు హైదరాబాద్ లో దిగిన తర్వాత మూడు గంటల్లోనే సోమశిల కు వెళ్ళవచ్చు.. రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు కాళేశ్వరం, కరీంనగర్ లోని దిగువ, మధ్య, ఎగువ మానేరు లలో పర్యాటకంగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. ఈనెల 30 వ తేది నుండి సోమశిల – శ్రీశైలం వరకు క్రూజ్ ప్యాకేజీ అమల్లోకి వస్తుందన్నారు.
ప్రతి శనివారం రెగ్యులర్ గా హైదరాబాద్ నుంచి ఈ టూర్ ను పర్యటకాభివృద్ది సంస్థ నడుపుతుందన్నారు. మిగతా రోజుల్లో డిమాండ్ ను బట్టి గ్రూపులకు, బల్క బుకింగ్ ద్వారా డిమాండ్ బట్టి ఆపరేట్ చేస్తున్నామన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు.
హైదరాబాద్ నుంచి సోమశిల – శ్రీశైలం వరకు పర్యాటక శాఖ అందిస్తున్న టూర్ ప్యాకేజీ వివరాలు.
హైదరాబాద్: రూ .2900 / – పెద్దలు కు, రూ .2320 / – చైల్డ్ కు దీని ద్వారా రవాణాను క్రూజ్ సౌకర్యం ఉంటుంది.
హైదరాబాద్ నుండి సోమశిలా & శ్రీశైలం వరకు నాన్-ఎసి హైటెక్ కోచ్ ఉంటుందన్నారు.
హైదరాబాద్, సోమశిల నుండి శ్రీశైలం వరకు బోటింగ్, వెజ్ లంచ్ ఉంటుంది. శ్రీశైలం వద్ద బోట్, నాన్-ఎసి వసతి కల్పిస్తున్నామన్నారు. క్రూజ్ (బోట్) సోమశిల నుండి శ్రీశైలం మరియు తిరిగి సోమశిలకు: రూ .2100 / – (పెద్దలు) మరియు రూ .1680 / – (పిల్లలకు ). ఛార్జీలు నిర్ణయించామన్నారు.
శ్రీశైలం వద్ద క్రూజ్ మరియు నాన్-ఎసి వసతిపై Veg.lunch. క్రూజ్ (వన్-వే) లేదా శ్రీశైలం – సోమశిల నుండి శ్రీశైలం వరకు క్రూజ్ నుండి సోమశిల (వన్-వే): రూ .900 / – (పెద్దలు) మరియు రూ .720 / – (చైల్డ్). ఛార్జీలలో క్రూజ్‌లో Veg.lunch ఉంటుందన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర టూరిజం జాయింట్ సెక్రటరీ K. రమేష్, రాష్ట్ర పర్యటకాభివృద్ది సంస్థ మనోహర్,టూరిజం అధికారులు G M (P R) పురెందర్, నేత్ర లు పాల్గొన్నారు.













