వచ్చే ఎన్నికల్లో ఖమ్మం లోక్సభ స్థానం నుంచి పోటీ : వీహెచ్
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఖమ్మం లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి తీరుతానని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు స్పష్టం చేశారు. గాంధీభవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఖమ్మంలో చాలా ఏళ్లుగా పనిచేస్తున్నానని, అక్కడి ప్రజలపై జరిగిన ప్రతి అన్యాయానికి వ్యతిరేకంగా తాను పోరాటం చేసినట్లు తెలిపారు. ఖమ్మం నుంచి పోటీ చేయాలని కార్యకర్తలు అడుగుతున్నారని, పార్టీ కోసం తనకంటే ఎక్కువ కష్టపడిన వాళ్లు ఎవరైనా ఉన్నారా? అని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డిపై తనకు నమ్మకముందని పేర్కొన్నారు. తానేం తప్పు చేశానని పక్కన పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్తగా వచ్చిన నాయకులు టికెట్లు అడిగితే తనలాంటి సీనియర్ల పరిస్థితేంటని ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో పెట్టిన అక్రమ కేసులన్నీ తొలగించాలన్నారు. బీజేపీ నేతలు తమ భాషను మార్చుకోవాలన్నారు.













