గుజరాత్ మోడల్ అంటే ఇదేనా ?
మాజీ ప్రధాని ఇందిరా గాంధీ బడుగు బలహీన వర్గాలు కోసం ఎంతో కృషి చేశారని మాజీ పీసీసీ అధ్యక్షులు వి. హనుమంతరావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియతో మాట్లాడుతూ ఈ రోజు గుజరాత్ లో బ్రిడ్జి కూలి 100 మంది చనిపోయారని అయినా కూడా పీఎం స్పందించలేదని అన్నారు. గుజరాత్ మోడల్ అంటే ఇదేనా అని ప్రశ్నించారు. బీసీ ప్రధానమంత్రిగా ఉన్న మోదీ బీసీలకు ఏమీ చేయలేదని విమర్శించారు. క్రిమిలేయర్ పెట్టి బీసీల నోట్లో మట్టి కొట్టారని మండిపడ్డారు. ప్రభుత్వ సంస్థలను అమ్మేసి రిజర్వేషన్లు లేకుండా చేస్తున్నారన్నారు. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వాలంటే బీసీలకు 50 శాతం ఇవ్వాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్లో రేపు జరగబోయే రాహుల్ గాంధీ జోడో యాత్ర ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.













