పీసీసీ పదవికి ఉత్తమ్ రాజీనామా?
హూజుర్నగర్ ఉప ఎన్నికల్లో ఘోర ఓటమి కాంగ్రెస్ పార్టీని తల దించుకునేలా చేసింది. పీసీసీ అధ్యక్షుడి హోదాలో, తన భార్యను కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలిపించుకోలేక పోయారని కాంగ్రెస్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు పీసీసీ అధ్యక్షుడి పదవికి ఉత్తమ్ వెంటనే రాజీనామా చేయాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఓటమిని ఊహించినప్పటికీ, మరీ ఇంత ఘోర పరాజయం పార్టీ నాయకులు, కార్యకర్తల్లో తీవ్ర అసంతృప్తిని కలిగించింది. 2018 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయినప్పుడే ఉత్తమ్ రాజీనామా చేయాలని డిమాండ్ లు వినిపించాయి. జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన విషయాన్ని కాంగ్రెస్ లీడర్స్ గుర్తు చేస్తున్నారు. ఉత్తమ్, టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, అందుకే కాంగ్రెస్ కు ఈ గతి పట్టిందని బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. కాంగ్రెస్ అధిష్టానం కూడా పీసీసీ పదవి నుండి ఉత్తమ్ తొలగించాలని ఇప్పటికే డిసైడ్ అయిపోయిందంటున్నారు సీనియర్ నేతలు. అంతకంటే ముందే ఉత్తమ్ రాజీనామా చేయనున్నారంటున్నారు.













