Uttam kumar reddy: ఆయన మృతి దేశానికి తీరని లోటు : ఉత్తమ్ కుమార్ రెడ్డి

మన్మోహన్ సింగ్ హయాంలోనే విప్లవాత్మక భూసేకరణ చట్టం వచ్చిందని తెలంగాణ రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam kumar reddy) అన్నారు. శాసనసభలో ఆయన మాట్లాడారు. దేశ క్షేమం, దృష్ట్యా మన్మోహన్ సింగ్ న్యూక్లియర్ ఒప్పందం (Nuclear deal) కుదుర్చుకున్నారు. ఆయన మృతి దేశానికి తీరని లోటు. రైతులకు రుణమాఫీ చేసిన తొలి ప్రధాని మన్మోహన్ సింగ్. సోనియా గాంధీ (Sonia Gandhi) సూచనల మేరకు ఆయన గొప్ప చట్టాలు తెచ్చారు. ఆయన ప్రధానిగా ఉన్నప్పుడే గ్రామీణ ఉపాధి హామీ చట్టం వచ్చింది. ప్రభుత్వంలో ఉన్నవారు జవాబుదారీగా ఉండాలని సమాచార హక్క చట్టం తీసుకొచ్చారు. ప్రజల సొమ్ముతో చేసిన పనుల వివరాలు తెలుసుకునే హక్కు దీని ద్వారా లభించింది. ఆకలి చావులు ఉండకూడదని ఆహార భద్రత చట్టం తెచ్చారు అని తెలిపారు.