ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్యే ప్రధాన పోటీ : మంత్రి ఉత్తమ్
గత ప్రభుత్వ అక్రమాలపై విచారణ ప్రారంభించామని, అవినీతికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. జాన్పహాడ్ దర్గా ఉర్సులో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొని, దర్గా అభివృద్ధికి రూ.కోటి ప్రకటించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మీడియాతో మాట్లాడుతూ లోక్సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ మరింత బలహీనమవుతుందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 14 లోక్సభ స్థానాలు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ఒకట్రెండు స్థానాలకే పరిమితమవుతుందని వ్యాఖ్యానించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్యే ప్రధాన పోటీ ఉంటుందన్నారు.













