ఆ వార్తల్లో నిజం లేదు : ఉత్తమ్
తాను పీసీసీ చీఫ్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సృష్టం చేశారు. పీసీసీ చీఫ్ మార్పుపై ఏఐసీసీ నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాలేదన్నారు. పరిషత్ ఎన్నికల ఫలితాలపై విశ్లేషించుకుంటామని చెప్పారు. పరిషత్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని ఆరోపించారు. హుజూర్నగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు తన భార్య పద్మావతికి ఆసక్తి లేదని తెలిపారు.













