తెలంగాణలోని పాయిగా టూమ్స్ పునరుద్ధరణకు అమెరికా నిధులు
హైదరాబాద్ సంతోష్‌నగర్ లోని పాయిగా టూమ్స్ను సందర్శించారా? అక్కడి ఆరు సమాధుల పరిరక్షణ, పునరుద్ధరణ కోసం అమెరికా ప్రభుత్వం రూ.2 కోట్ల (2.5 లక్షల డాలర్లు) నిధులతో కూడిన ప్రాజెక్టును ప్రకటించింది. ఈ మేరకు అమెఇకా చార్జ్ డీ ఎఫైర్స్ అంబాసిడర్ బెత్జోన్స్ పేర్కొన్నారు. కాగా ఈ ప్రాజెక్ట్‌ను హైదరాబాద్‌లోని యూఎస్ కాన్సులేట్ ద్వారా నిధులు మంజూరై ఐదో పరిరక్షణ ప్రాజెక్ట్, ఆగాఖాన్ ట్రస్ట్ ఫర్ కల్చర్ నిర్వహించనుంది. హైదరాబాద్‌లోని చారిత్రక ప్రదేశాల పరిరక్షణ, పునరుద్ధరణ కోసం అమెరికా ప్రభుత్వం నిధులు కేటాయించడం ఇది మొదటిసారి కాగని జోన్స్ అన్నారు. ఈ అద్భుతమైన స్మారక చిహ్నాలను పరిరక్షించడానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందని, అందులో తాము భాగస్వాములైనందకు గర్వపడుతున్నామని తెలిపారు. ఈ ప్రాజెక్టును ప్రకటించిన అనంతరం జోన్స్, అమెరికా కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్, ఆగాఖాన్ ట్రస్ట్ ఫర్ కల్చర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి రతీశ్ నందా కలిసి పాయిగ్ టూమ్స్ని సందర్శించారు.













