టీబీ నిర్మూలనకు అమెరికా సాయం
భారత్లో టీబీ (ట్యూబర్క్యూల్సిస్) నిర్మూలనకు అమెరికా చెందిన అంతర్జాతీయ అభివృద్ది సంస్థ యూఎస్ ఎయిడ్ సాయం అందించడానికి ముందకొచ్చింది. 2025 నాటికి భారతను టీబీరహితంగా మార్చాలని లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారని, ఈ క్రమంలో పదిలక్షల డాలర్లను సాయంగా అందిస్తున్నట్టు ఆ సంస్థ అడ్మినిస్ట్రేటర్ మార్క్ గ్రీన్ జీఈ సదస్సులో ప్రకటించారు. భారత్లో ఏటా 28 లక్షల టీబీ కేసులు నమోదవుతున్నాయని, 4.35 లక్షలమంది చనిపోతున్నారని చెప్పారు. 1998 నుంచి యూఎస్ ఎయిడ్ సంస్థ భారత్లో టీబీ నిర్మూలన కోసం 140 మిలియన్ డాలర్లకు పైగా వెచ్చించిందని, టీబీ నిర్మూలనకు తమవంతు కృషి చేస్తామని పేర్కొన్నారు. అనంతరం జీఈఎస్ ప్రతినిధుల బృందంతో కలిసి మార్క్ గ్రీన్ హైదరాబాద్లోని ఎర్రగడ్డలోని టీబీ సెంటర్ను సందర్శించి, రోగులకు అందుతున్న సేవలను పరిశీలించారు.













