మహిళాభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యం…
మహిళాభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యమని అమెరికా బలంగా విశ్వసిస్తోందని అమెరికా కాంగ్రెస్ మహిళా ప్రతినిధులు టెర్రి ఏ.సేవిల్, డీనా టిటుస్ పేర్కొన్నారు. ఇండో అమెరికన్ చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో జరిగిన మహిళా పారిశ్రామికవేత్తలతో నిర్వహించిన చర్చాగోష్ఠిలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా మహిళా స్టార్టప్‌ల కోసం హైదరాబాద్‌లో ఇటీవలే ప్రారంభించిన వీ-హబ్ గురించి సీఈవో దీప్తి రావుల వారికి వివరించారు. ఈ సందర్భంగా అమెరికా మహిళా కాంగ్రెస్ ప్రతినిధులు వీ-హబ్ ఆశయం తమ దేశ ఆలోచనలకు దగ్గరిగా ఉందంటూ ప్రశంసించారు. సమావేశంలో ఇండో అమెరికా ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు, వీహబ్ సీఈవో రావుల దీప్తి, పారిశ్రామికవేత్తలు, గీత, మైత్రేయి, రజని, శ్రీదేవి పాల్గొన్నారు.













