23 నుంచి కొత్త భవనంలో అమెరికా కాన్సులేట్ సేవలు
హైదరాబాద్ లోని అమెరికా కాన్సులేట్ నానక్‌రాంగూడలోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో నిర్మించిన సొంత భవనానికి మారుతోంది. ఆ ప్రాంగణంలో ఈ నెల 23 నుంచి వీసా సేవలను ప్రారంభించనున్నట్టు కాన్సులేట్ ప్రకటించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఒడిశా ప్రజలకు వీసా సేవలతో పాటు ఆయా ప్రాంతాల్లోని అమెరికా సంస్థలకు ఈ కార్యాలయం నుంచే సేవలు అందించనుంది. నూతన ప్రాంగణ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నానక్‌రాంగూడలో 12.3 ఏకరాలు కేటాయించడంతో 2017లో శంకుస్థాపన చేశారు. 340 మిలియన్ డాలర్ల వ్యయంతో ఆధునిక హంగులతో కాన్సులేట్ భవనాన్ని నిర్మించారు.













