హైదరాబాద్ లో ఘనంగా యూఎస్ కాన్సులేట్ వార్షికోత్సవం
హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. అత్యాధునిక సదుపాయాలతో నిర్మించిన నూతన భవనంలోకి త్వరలో మారిపోతున్న వేళ కార్యాలయ సిబ్బంది ఈ వేడుకల్లో సందడి చేశారు. బేగంపేటలోని పైగా ప్యాలస్‌లో గత 14 ఏళ్ల క్రితం ఇదేరోజు (2008 అక్టోబర్ 24న) యూఎస్ కాన్సులేట్ కార్యాలయంలో తొలిసారి అమెరికా జెండా ఎగిరింది. 300 మిలియన్ల డాలర్ల వ్యయంతో అత్యాధునిక సదుపాయాలతో నిర్మించిన భవనం నుంచి కార్యకలాపాలు నిర్వహించనున్న యూఎస్ కాన్సులేట్ సిబ్బందికి ఈ కార్యాలయంలో ఇదే ఆఖరి వార్షికోత్సవం కావడం గమనార్హం.
హైదరాబాద్‌లోని కాన్సులేట్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశాలలో అమెరికా`భారత్ సంబంధాలను పర్యవేక్షిస్తుంటుంది. ఈ సందర్భంగా కాన్సులేట్ జనరల్ జెన్నీఫర్ లార్సన్ వీడియోను విడుదల చేశారు. అలాగే దీపావళి వేడుకల్ని సైతం కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.













