బతుకమ్మ సంబురాల్లో అమెరికా కాన్సులేట్ జనరల్ జెన్పీఫర్
రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం నర్కూడ అమ్మపల్లి ( శ్రీసీతారామచంద్రస్వామి) ఆలయం వద్ద జరిగిన బతుకమ్మ సంబురాల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. బతుకమ్మ సంబురాల్లో అమెరికా కాన్సులేట్ జనరల్ జెన్నీఫర్ లార్సన్ పాల్గొని బతుకమ్మ ఆడారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ తిలక్ తనకు స్ఫూర్తి అని తెలిపారు. స్వాతంత్య్రోద్యమ సమయంలో పండుగలు, సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా తిలక్ బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా పోరాడారని తెలిపారు. తిలక్ స్ఫూర్తితో తాము కూడా అనేక కార్యక్రమాలు నిర్వహించామని చెప్పారు. అమ్మపల్లి దేవాలయం ఆవరణలో జరిగిన బతుకమ్మ సంబురాలు అమెరికా వరకు చేరుతున్నాయన్నారు. తెలంగాణ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన ఘనత బతుకమ్మ పండగదని ఆమె పేర్కొన్నారు.













