హైదరాబాద్ లో యూఎస్ కాంగ్రెస్ ప్రతినిధుల బృందం పర్యటన
యునైటెడ్ స్టేట్స్ కాంగ్రెస్ ప్రతినిధుల బృందం హైదరాబాద్లో పర్యటించింది. ఈ సందర్భంగా రో ఖన్నా నేతృత్వంలోని యూఎస్ కాంగ్రెస్ బృందం హైదరాబాద్లో యూఎస్ ఎంబసీ కాన్సులర్ జనరల్ ఎంఎస్ జెన్నిఫర్, రాష్ట్ర ఇన్సర్మేషన్ టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్ (ఐటీఅండ్సీ) స్పెషల్ సెక్రటరీ విష్ణు రెడ్డి, టీసీఎస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ వీ రాజన్నలను కలిశారు. నగరంలో టాటా గ్రూప్, టీసీఎస్ కార్యకలాపాలు, తెలంగాణలో వ్యాపార పర్యావరణ వ్యవస్థ గురించి రాజన్న ప్రతినిధుల బృందానికి వివరించారు. ఈ సమావేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రాంతీయ పాస్ పోర్టు అధికారి బాదలయ్య, కాన్సులేట్ జనరల్ కార్యాలయానికి చెందిన రాఘవన్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.













