భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న యూపీ సీఎం
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌తో ఆలయానికి చేరుకున్నారు. యూపీ సీఎంకు అమ్మవారికి యోగి ప్రత్యేక పూజలు చేశారు. మహా హారితిలోనూ పాల్గొన్నారు. యోగికి బండి సంజయ్ భాగ్యలక్ష్మి అమ్మవారి చిత్ర పటాన్ని బహుకరించారు. యోగి రాకతో చార్మినార్ పరిసరాలు కాషాయ జెండాలతో రెపరెపలాడాయి. కార్యకర్తలు పెద్ద పెట్టున నినాదాలు చేశారు. నలువైపులా ఆంక్షలు విధించారు. బీజేపీ నేతలు ఉమామహేంద్ర, ఆలె భాస్కర్, పొన్న వెంకటరమణ యూపీ సీఎంను పూలమాలతో సన్మానించారు. కాగా యోగి భాగ్యలక్ష్మి ఆలయానికి వస్తుండడంతో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఆధ్వర్యంలో చార్మినార్ పరిసరాలను ఆధీనంలోకి తీసుకున్నారు.













