విదేశీ విద్యార్థులు ఎంత మంది వస్తే.. అంత మందికి
విదేశీ విద్యార్థులను ఆకర్షించేందుకు తెలంగాణ ఉన్నత విద్యామండలి చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా అంతర్జాతీయ విద్యార్థులకు అన్లిమిటెడ్ సీట్లను కేటాయించాలని నిర్ణయించింది. డిగ్రీ, పీజీ కోర్సుల్లో ఎంత మంది వస్తే అంత మంది విద్యార్థులకు ప్రవేశాలు కల్పించనున్నది. అవసరమైతే సూపర్ న్యూమరరీ కోటాలో సీట్లను పెంచి అడ్మిషన్లు ఇవ్వనున్నది. మన దగ్గర డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు దోస్త్ సీపీగెట్ ను నిర్వహిస్తున్నారు. ఈ ప్రవేశాల పరీక్షల ర్యాంక్‌ల ఆధారంగానే సీట్లను కేటాయిస్తున్నారు. విదేశీ విద్యార్థులకు మాత్రం ప్రవేశ పరీక్షతో నిమిత్తం లేకుండా ఎంత మంది వచ్చినా సీట్లు కేటాయిస్తామని తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి తెలిపారు. రాష్ట్రంలోని అన్ని వర్సీటల్లో ఈ విధానం అమలవుతుందని వెల్లడించారు.













