సమతా మూర్తి ని సందర్శించిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్

హైదరాబాద్‌లోని సమతా మూర్తి స్ఫూర్తి కేంద్రాన్ని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పియూష్ గోయల్ సందర్శించారు. సుమారు మూడు గంటల పాటు ఆయన సమతా మూర్తి సన్నిధిలో ఉన్నారు. స్వర్ణ రామాజులవారి దర్శనం చేసుకుని వేద ఆశీర్వచనం తీసుకున్నారు. అనంతరం చిన్న జీయర్ స్వామి వారి ఆశీర్వాదం తీసుకున్నారు.