సరికొత్త సంకల్పంతో ఇక్రిశాట్ ముందుకు : కేంద్ర మంత్రి తోమర్
సరికొత్త సంకల్పంతో ఇక్రిశాట్ ముందుకు సాగాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ అన్నారు. ఇక్రిశాట్ స్వర్ణోత్సవాలలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా తోమర్ మాట్లాడుతూ సరికొత్త వంగడాల సృష్టికి ఇక్రిశాట్ మరిన్ని పరిశోధనలు చేయాలన్నారు. 2005 నుంచి బడ్జెట్లో వ్యవసాయ రంగానికి కేటాయింపులు పెరిగినట్లు తెలిపారు. మరో 25 ఏళ్లలో మన వ్యవసాయ రంగంలో పెను మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. మన రైతులు ఎంతో కష్టపడి పంటల దిగుబడి పెంచుతున్నారు. ఇప్పటి వరకు జై జవాన్, జై కిసాన్ అనే నినాదాలు మాత్రమే మనకు తెలుసు. వాటాకి అదనంగా జై విజ్ఞాన్, జై అనుసంధాన్ నినాదాలను ప్రధాని మోదీ చేర్చారు. ఇప్పుడు దేశ ప్రజల ఆహారంలో చిరుధాన్యాలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. ఆ దిశగా పరిశోధనలు విస్తృతం చేయాలన్నారు.













