టీఆర్ఎస్ను గద్దె దించటానికే ప్రజా సంగ్రామ యాత్ర
టీఆర్ఎస్ను గద్దె దించటానికే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్నారని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. చార్మినార్ వద్ద బీజేపీ ఆధ్వర్యంలో ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కల్వకుంట్ల కుటుంబం ఎన్ని కుట్రలు చేసినా హుజూరాబాద్‌లో బీజేపీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. దళితులకు ముఖ్యమంత్రి పదవి, మూడెకరాల భూమి పేరుతో కేసీఆర్ మోసం చేశారని అన్నారు. బీసీలకు టీఆర్ఎస్ ప్రభుత్వం వెన్నుపోటు పొడిచిందని మండిపడ్డారు. తెలంగాణలో అవినీతి రూపంలో వేల కోట్లు వృథా అవుతున్నాయని విమర్శించారు.













