ఇంటిగ్రేటెడ్ లైట్స్, ప్రొజెక్షన్ షో ప్రారంభించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
వందేమాతరం నుంచి మలిదశ తెలంగాణ ఉద్యమం వరకు ఎన్నో సామాజిక, సాంస్కృతిక ఉద్యమాలకు ఓయూ అడ్డాగా నిలిచిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కేంద్ర పర్యాటక శాఖ నిధులు రూ.11.8 కోట్లతో ఆర్ట్స్ కళాశాల భవనానికి ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ లైట్స్, ప్రొజెక్షన్ షోను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ నిధులతో ఓయూలో సింథటిక్ టెన్నిస్ కోర్టు, బాలికల వసతి గృహంలో ఈత కొలను అందుబాటులోకి తెస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వీసీ ప్రొ.రవీందర్, రిజిస్ట్రార్ ప్రొ.లక్ష్మీనారాయణ, మాజీ వీసీ డీసీ రెడ్డి, సినీనటుడు సాయికుమార్, ఉప మేయర్ మోతే శ్రీలత రెడ్డి పాల్గొన్నారు.













