ఆ అధికారం కేంద్రానికి లేదు : కిషన్ రెడ్డి
సింగరేణిని ప్రైవేటీకరించే అధికారం కేంద్రానికి లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సింగరేణి ప్రైవేటీకరణ చేయడం లేదని ప్రధాని మోదీనే చెప్పారని తెలిపారు. కొందరు కావాలనే విషప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీకి వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేకపోతున్నారన్నారు. అభద్రతా భావంతోనే కేసీఆర్ కుటుంబం విమర్శలు చేస్తుందన్నారు. యూఏపీ హయాంలో రూ.1.86 లక్షల కోట్ల కుంభకోణం జరిగిందన్నారు. బొగ్గు బ్లాక్‌ల వేలంలో పారదర్శకత ఉండేలా ప్రధాని మోదీ చర్యలు తీసుకుంటారని వ్యాఖ్యానించారు.













