జీవో 317పై ఉద్యోగుల్లో ఆందోళన : కిషన్ రెడ్డి
జీవో 317పై ఉద్యోగుల్లో ఆందోళన నెలకొందని, జీవో 317 తీసుకురావడం ప్రభుత్వ తొందరపాటు చర్య అని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఢల్లీిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దీక్షకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని ప్రశ్నించారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ జీవోపై నిరసన తెలిపేందుకే బండి సంజయ్ దీక్ష చేశారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మాస్కు పెట్టుకోవడం తాను ఎప్పుడూ చూడలేదన్నారు. మంత్రుల నల్గొండ పర్యటనలో ఎవరూ మాస్కు పెట్టుకోలేదని తెలిపారు. కొవిడ్ నిబంధనలు టీఆర్ఎస్ నేతల పాటించడం లేదని మండిపడ్డారు. కరీంనగర్ జిల్లా పార్టీ భేటీలోనూ మాస్కులు పెట్టుకోలేదన్నారు. టీఆర్ఎస్ నేతల కొవిడ్ నిబంధనల ఉల్లంఘనలు పోలీసులకు కనిపించడం లేదా? అని ప్రశ్నింంచారు. టీఆర్ఎస్ నేతల కొవిడ్ ఉల్లంఘనలపై కేసులు పెడితే రాష్ట్రంలోని జైళ్లు సరిపోవని కిషన్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.













