కేంద్ర హోం మంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యటన.. షెడ్యూల్ ఇదే !
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. 23వ తేదీ మధ్యాహ్నం 3:30 గంటలకు అమిత్ షా శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. 3:50 గంటలకు నోవాటెల్ హోటల్‌కు వెళ్తారు. 4 గంటల నుంచి 4:30 గంటలకు వరకు ఆర్ఆర్ఆర్ మూవీ టీంతో సమావేశం అవుతారు. 4:30 గంటల నుంచి 5:10 గంటల వరకు బీజేపీ కోర్ కమిటీ సమావేశం అవుతుంది. సాయంత్రం 5:15 గంటలకు అమిత్ షా చేవెళ్ల సభకు బయలుదేరుతారు. సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటలకు వరకు అమిత్ షా బహిరంగ సభలో పాల్గొంటారు. తిరిగి రాత్రి 7:45 గంటలకు అమిత్ షా శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. ఢల్లీికి పయనమవుతారు.













