తెలంగాణలో టీడీపీకి మరో షాక్
తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి మరో షాక్ తగిలింది. తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఆ పార్టీ సీనియర్ నాయకురాలు, మాజీ మంత్రి ఉమామాధవరెడ్డి రాజీనామా చేశారు. ఈ మేరకు ఉమామాధవరెడ్డి తన రాజీనామా లేఖను తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు ఫ్యాక్స్ ద్వారా పంపించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో గత్యంతరం లేకే రాజీనామా చేశామని పేర్కొన్నారు. మా పరిస్థితి అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నామన్నారు. పార్టీలో, ప్రభుత్వంలో పదవులిచ్చి ఎంతో గౌరవించారని తెలిపారు. దశాబ్దాలుగా టీడీపీతోమా మా కుటుంబానికి మంచి అనుబందం ఉందని ఆమె అన్నారు.













