తెలంగాణ చీఫ్ జస్టిస్ గా ఉజ్జల్ భుయాన్
తెలంగాణ హైకోర్టు కొత్త ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భూయాన్ పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుత సీజే జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ ఢల్లీి హైకోర్టుకు బదిలీ కానున్నారు. ఈ మేరకు తెలంగాణ సహా ఆరు హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తుల నియామకాలకు కేంద్రం ఆమోదం తెలిపింది. సుప్రీంకోర్టు కొలీజియం మే 17న చేసిన సిఫారసులను ఆమోదించి, రాష్ట్రపతికి నివేదించింది. రాష్ట్రపతి ఆమోద ముద్ర అనంతరం సీజేల నియమాకాలు అమల్లోకి వస్తాయి. చాలాకాలంగా ఢల్లీి, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, గౌహతి హైకోర్టులకు సీజేలు లేరు. ఈ హైకోర్టులకు కూడా సీజేలను నియమించారు.













