రాష్ట్రపతి నిలయంలో ఘనంగా ఉగాది వేడుకలు

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్, బొల్లారంలోని రాష్ట్రపతి నియలంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్రపతి నిలయం అధికారిణి రజినీ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో రాష్ట్ర గవర్నర్ కార్యదర్శి బుర్రా వెంకటేశం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం హైదరాబాద్ వైస్ ఛాన్సలర్ టీ. కిషన్‌రావు, రెయిన్ వాటర్ ఫౌండర్ కల్పన రమేశ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. వేడుకల్లో భాగంగా ప్రముఖ వేదాంతి చిర్రావూరి విజయ్ అనంత్ పంచాంగ శ్రవణం చేవారు. క్రోధి నామ సంవత్సరంలో ప్రజలకు కలిగే క్రోధం దేశ ప్రయోజనాలకు ఉపయోగపడుతుందని అన్నారు. ఈ సందర్భంగా బుర్రా వెంకటేశం మాట్లాడుతూ రాష్ట్రపతి నిలయం ప్రజలకు సాంస్కృతిక వారధిగా ఉండడం శభపరిణామమన్నారు. అనంతరం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.