చరిత్ర సృష్టించిన ట్రాన్స్ జెండర్లు.. ఉస్మానియా మెడికల్ ఆఫీసర్లుగా
తెలంగాణ రాష్ట్రంలో ట్రాన్స్ జెండర్లు చరిత్ర సృష్టించారు. ఇద్దరు ట్రాన్స్ జెండర్లు (లింగ మార్పిడి చేయించుకున్న వారు) ప్రభుత్వ వైద్యులుగా ఎంపికయ్యారు. ప్రాచీ రాథోడ్, కొయ్యల రుత్ జాన్ పాల్ మెడికల్ ఆఫీసర్లుగా ఎంపికై ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో నియమితులయ్యారు. ప్రభుత్వ రంగంలో వైద్యులుగా వీరి నియామకం ట్రాన్స్ జెండర్ కమ్యూనిటీ సానుకూలమని భావిస్తున్నారు. ఇది నిజంగా నాకు, ట్రాన్స్ జెండర్ల కమ్యూనిటీకి గొప్ప రోజు. 2018లోనే వైద్య విద్య పూర్తయింది. 15 హాస్పటల్స్‌లో ఉద్యోగం కోసం తిరిగాను. కానీ నన్ను తిరస్కరించారు. అందుకు కారణం చెప్పకపోయినా నేను అర్థం చేసుకున్నారు అని ఖమ్మం పట్టణానికి చెందిన డాక్టర్ రుత్ తెలిపారు. మల్లారెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో ఆమె ఎంబీబీఎస్ చదవింది. డాక్టర్ ప్రాచీ ఆదిలాబాద్ రిమ్స్‌లో ఎంబీబీఎస్ పూర్తి చేసింది.













