మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక వ్యాఖ్యలు
టీఆర్ఎస్ నాయకులు, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఖమ్మం జిల్లా మధిరిలో ఓ ప్రైవేటు కార్యక్రమానికి హాజరైన తుమ్మల ఈ వ్యాఖ్యలలు చేశారు. టీఆర్ఎస్కు రెబల్‌గా మారాల్సిన అవసరం లేదన్నారు. వ్యక్తిగత లబ్ది కన్నా పార్టీ నిర్ణయమే తనకు ముఖ్యమని స్పష్టం చేశారు. ప్రజల అంచనాలకు తగ్టట్టుగా ప్రజా ప్రతినిధుల నడవడిక ఉండాలన్నారు. సీఎం కేసీఆర్ పాలనాదక్షతపై ప్రజలకు అపార నమ్మకం ఉందన్నారు. పార్టీ నిర్ణయం, ప్రజాభిప్రాయం మేరకు వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని స్పష్టం చేశారు. పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలను తుమ్మల ఖండించారు.













