పీవీ, ఎన్టీఆర్ జోలికి వస్తే ఖబడ్డార్..
గ్రేటర్ ఎన్నికల్లో ఓట్ల కోసం మహానీయులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని మహనీయుల జోలికి పోతే చరిత్రలో లేకుండా పోతారని హెచ్చరించారు తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎల్.రమణ. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓట్ల కోసం ఎంఐఎం, బీజేపీలు భారత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు, తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని దేశవ్యాప్తం చేసిన ఉమ్మడి ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌లను వివాదాల్లోకి లాగుతున్నాయని ఆవేదన చెందారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎంఐఎం పార్టీ హుస్సేన్‌సాగర్‌పై ఉన్న పీవీ, ఎన్టీఆర్ స్మారక స్థూపాలను కూడా కూల్చివేయాలనడం వారి సంస్కారహీనానికి నిదర్శనమన్నారు. తెలుగు జాతి గర్వించదగ్గ వ్యక్తి ఎన్టీఆర్ జోలికి వస్తే ఖబడ్డార్ అంటూ హెచ్చరించారు. మనోన్నతమైన వ్యక్తులు గురించి మాట్లాడే అర్హత, స్థాయి ఆ పార్టీలకు లేవని చెప్పారు.













