ఎన్టీఆర్ ఘాట్ వద్ద బోరున విలపించిన మోత్కుపల్లి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనను దగా చేశారంటూ మోత్కుపల్లి నర్సింహులు బోరున విలపించారు. ఎన్టీఆర్ ఘాట్లో నివాళులర్పించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కన్నీటి పర్యంతం అయ్యారు. చంద్రబాబు తనను గవర్నర్ చేస్తానని, ఆ తర్వాత రాజ్యసభకు పంపిస్తానని చెప్పి మోసం చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కష్టాల్లో ఉన్నపుడు చంద్రబాబుకు అండగా ఉంటే, ఇప్పుడు తనను మహానాడుకు పిలవకుండా అవమానించారని విలపించారు. టీడీపీ బాగుండాలి అంటే నందమూరి వారసులకు పార్టీని అప్పగించాలని డిమాండ్ చేశారు.













