రేపటి బంద్‌ను విజయవంతం చేయాలి
తెలంగాణ ఆర్టీసీలో ప్రతి ఒక్కరూ నాయకులేనని కార్మిక సంఘాల ఐకాస చైర్మన్ అశ్వత్థామరెడ్డి అన్నారు. ప్రజా రవాణా వ్యవస్థను బతికించాలని తాము కోరుతున్నామని చెప్పారు. సకల జనుల సమరభేరి కార్యక్రమంలో అశ్వత్థామరెడ్డి మాట్లాడారు. రాష్ట్రంలో ప్రతి గ్రామానికి బస్సులు తిరగాలని తాము కోరుకుంటున్నామన్నారు. 4 కోట్ల మంది ప్రజలు ఉన్న తెలంగాణలో బస్సుల సంఖ్య ఎందుకు తగ్గిపోతోందని ఆయన ప్రశ్నించారు. ఆర్టీసీని ప్రైవేటీకరించడం సరికాదంటున్న సీఎం కేసీఆర్, సమస్యలపై మాత్రం దృష్టిపెట్టడం లేదని విమర్శించారు. ఈ విషయంలో కేసీఆర్ వైఖరి నోటితో పలకరించి నొసటితో వెక్కిరించినట్లుందని వ్యాఖ్యానించారు. ఆర్టీసి సమ్మెకు అన్ని వర్లాలు సహకరించాలని, రేపటి తెలంగాణ బంద్‌ను విజయవంతం చేయాలని ఆయన కోరారు.













