చర్చల పేరుతో ప్రభుత్వం మైండ్ గేమ్ ఆడుతోంది
ఆర్టీసీ సమ్మె యథాతథంగా కొనసాగుతుందని ఐకాస ప్రకటించింది. భవిష్యత్ కార్యాచరణపై సమావేశమైన ఐకాస నేతలు ప్రభుత్వం తీరును తప్పుబట్టారు. చర్చలకు సంబంధించి ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి ఆహ్వానం అందలేని ఆర్టీసీ ఐకాస కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి వెల్లడించారు. చర్చల పేరుతో ప్రభుత్వం మైండ్ గేమ్ ఆడుతోందని మండిపడ్డారు. తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చేవరకూ పోరాటం కొనసాగిస్తామని సృష్టం చేశారు. తమకు సంఘీభావంగా ఢిల్లీ, చెన్నై నుంచి కార్మికులు వస్తున్నారని తెలిపారు. ఈ నెల 19న చేపట్టనున్న తెలంగాణ బంద్కు పలు రాజకీయ పార్టీలు, ఉద్యోగ సంఘాలు మద్దతు ప్రకటించాయన్నారు. తాము చేపడుతున్న సమ్మె యావత్ దేశాన్ని కదలిస్తోందని, దీన్ని మరింత ఉదృతం చేస్తామని పేర్కొన్నారు.













