తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. త్వరలోనే
తెలంగాణ రాష్ట్రంలో బీఈడీ, డీఈడీ కోర్సులు పూర్తి చేసిన టీచర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. తెలంగాణలో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులు భర్తీ చేసేందుకు ఉపాధ్యా అర్హత పరీక్ష (టెట్) నిర్వహించాలని మంత్రి వర్గ ఉప సంఘం నిర్ణయించింది. విద్యాశాఖలో సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలతో పాటు టీచర్ పోస్టుల భర్తీ, మన ఊరు`మన బడి పురోగతిపై చర్చించేందుకు మంత్రివర్గ ఉప సంఘం భేటీ అయింది. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో జరిగిన ఈ సమావేశానికి మంత్రులు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, సత్యవతి రాథోడ్, ఇంద్రకరణ్ రెడ్డి, జగదీశ్‌రెడ్డి సహా విద్యాశాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. వివిధ అంశాలపై చర్చించిన మంత్రి వర్గ ఉప సంఘం మరోసారి భేటీ కావాలని నిర్ణయించింది. చివరిసారిగా గతేడాది జూన్ 12న విద్యాశాఖ టెట్ నిర్వహించిన విషయం తెలిసిందే.













