గ్రేటర్ ఎన్నికలపై ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేం…
గ్రేటర్ హైదరాబాద్ (జీహెచ్ఎంసీ) ఎన్నికలపై ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని తెలంగాణ హైకోర్టు సృష్టం చేసింది. గ్రేటర్ ఎన్నికల రిజర్వేషన్లకు సంబంధించి దాఖలైన పలు పిటిషన్లపై హైకోర్టు విచారణ చేపట్టింది. మున్సిపల్ యాక్ట్ ప్రకారం మేయర్, కార్పొరేటర్ల రిజర్వేషన్ల కేటాయింపు సక్రమంగా జరగలేదని న్యాయవది రచనారెడ్డి హైకోర్టుకు వివరించారు. వెంటనే బల్దియా ఎన్నికలను నిలిపివేయాలని హైకోర్టును కోరారు. దీనికి స్పందించిన హైకోర్టు •గ్రేటర్ ఎన్నికలకు మరో వారం రోజులు ఉన్న ఈ సమయంలో తాము ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని తేల్చి చెప్పింది. జీహెచ్ఎంసీ ఎన్నికలపై దాఖమైన పలు పిటిషన్లు, రిట్ పిటిషన్లను డిసెంబర్ 23న విచారణ చేపడతామని తెలిపింది. తదుపరి విచారణను హైకోర్టు డిసెంబర్ 23కు వాయిదా వేసింది.













