తెలంగాణలో పెరిగిన కరోనా కేసులు
రాష్ట్రంలో కరోనా వైరస్ సంఖ్య పెరిగిందని తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ కరోనా వైద్య సేవలు అందించేందుకు గచ్చిబౌలి స్టేడియంలోని 13 అంతస్తుల్లో 15 వందల పేషెంట్లకు వైద్యం అందించేందుకు ఐసోలేషన్ కేంద్రాన్ని సిద్ధం చేస్తున్నామని తెలిపారు. తెలంగాణలో 47 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని తెలిపారు. ప్రజల ఆరోగ్య బాధ్యత ప్రభుత్వానిదన్నారు. అయితే జిల్లాలో రెడ్ జోన్లు లేకపోవడంతో ఓల్డ్ సిటీలో కరోనా సోకిన ఓ వ్యక్తి మరో 6 మందికి కరోనా అంటించినట్లు తెలిసిందని తెలిపారు. ఇక ఒక డాక్టర్ ఇంట్లో నలుగురికి కరోనా సోకగా.. ఎయిర్ పోర్టులో పనిచేస్తున్న నలుగురికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు తెలిపారు. కాగా కరోనాతో ఇప్పటీ వరకు రాష్ట్రంలో ఒక్కరు కూడా చనిపోలేదని, ఈ వైరస్ బారిన పడిన బీపీ, షుగర్, కిడ్ని పేషంట్ల ఆరోగ్య పరిస్థితి కొంత ఇబ్బంది కరంగా ఉందని వెల్లడించారు.













