నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 2వేలకు పైగా ఉద్యోగాలకు నోటిఫికేషన్
తెలంగాణలోని నిరుద్యోగులకు రాష్ట్ర సర్కార్ అదిరిపోయే గుడ్ న్యూస్ అందించింది. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలందించేందుకు కొత్తగా మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం.. రాష్ట్ర వ్యాప్తంగా 2,391 పోస్టుల భర్తీ చేసేందుకు సర్కార్ సిద్ధమైంది. ఈ మేరకు ఆర్థిక శాఖ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఈ విషయాన్ని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అధికారికంగా ట్వీటర్ ద్వారా తెలియజేశారు. ఈ పోస్టులను టీఎస్పీఎస్సీ, మెడికల్ హెల్త్ బోర్డు, మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల విద్యాసంస్థ భర్తీ చేయనుంది.
ఇది మాత్రమే కాకుండా బీసీ గురుకులాల్లో మొత్తం 1,499 పోస్టులను భర్తీ చేయనున్నారు. ప్రిన్సిపాల్ పోస్టులు 10, డిగ్రీ లెక్చరర్స్ 480, జూనియర్ లెక్చరర్స్ 185, పీజీటీ 235, టీజీటీ 324 పోస్టులను భర్తీ చేయనున్నారు. సమాచార పౌర సంబంధాల శాఖలో 166 పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చింది ఆర్థిక శాఖ. ఇదిలా ఉంటే ఇప్పటికే రాష్ట్రంలో అనేక ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదలైన విషయం తెలిసిందే. చాలా ఉద్యోగాల నోటిఫికేషన్లకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది. గ్రూప్-3 నోటిఫికేషన్ల దరఖాస్తులు ఫిబ్రవరి చివరి వారంలో ముగియనున్నాయి. ఈ ఉద్యోగాలకు ఫిబ్రవరి 23 సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు.
https://twitter.com/BRSHarish/status/1618924185849597953?s=20&t=Ol2eW0rMwYpFY7idhJQ9HQ













