అందరికీ ఆన్‌లైన్‌లోనే విద్యా బోధన : సబితా ఇంద్రారెడ్డి

తెలంగాణ విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని కేజీ టూ పీజీ వరకూ ఆన్‌లైన్‌లోనే బోధన కొనసాగిస్తామని తెలంగాణ విద్యాశాఖా మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. ఇలా ఆన్‌లైన్ బోధన వైపే మొగ్గు చూపాలని సీఎం కేసీఆర్ సూచించారని తెలిపారు. టీశాట్, దూరదర్శన్ ద్వారా పాఠ్యాంశాల బోధన ఉంటుందని తెలిపారు.ఈ యేడాది ట్యూషన్ ఫీజులు మాత్రమే వసూలు చేయాలని సూచించారు. అయితే ఆయా సెట్స్‌కు సంబంధించిన తేదీల్లో మాత్రం ఎలాంటి మార్పులూ ఉండవని, ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు.