వివిధ శాఖల అధికారులతో ఎస్.కె. జోషి సమన్వయ సమావేశం
తేది 15 నుండి 16 వరకు హైదరాబాదు పర్యటనకు విచ్చేయుచున్న ఇస్లామిక్ రిపబ్లిక్ ఇరాన్ ప్రెసిడెంట్ డా. హసన్ రోహనీ (Dr. Hassan Rouhani) పర్యటనకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ ఎస్.కె. జోషి వివిధ శాఖల అధికారుల ను ఆదేశించారు. ఆయన బుధవారం సచివాలయంలో ఇరాన్ అధ్యక్షుని పర్యటన ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.
ఈ పర్యటన సందర్భంగా తగు బద్రత, ట్రాఫిక్ నియంత్రణ, ప్రోటోకాల్ మరియు స్వాగతించడానికి విస్తృతంగా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ ఎస్.కె. జోషి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. బేగంపేట్ విమానాశ్రయంలో కస్టమ్స్ మరియు ఇమ్మిగ్రేషన్ అరేంజ్ మెంట్లు చేయాలని సంబందిత శాఖ అధికారులను ఆదేశించారు.
డా. హసన్ రోహనీ ని బేగంపేట్ విమానాశ్రయంలో స్వాగతించడానికి గాను కేంద్ర విద్యుత్ మరియు రేన్యూవేబుల్ ఎనర్జీ మంత్రి శ్రీ ఆర్.పి. సింగ్ ను కేంద్ర ప్రభుత్వం నియమించిందని తెలిపారు. శుక్రవారం రోజున ఇరాన్ ప్రెసిడెంట్ డా. హసన్ రోహనీ సాలార్ జంగ్ మ్యూజియం, మక్కా మజిద్ లను సందర్శిస్తారని తెలిపారు.
ఇరాన్ కు హైదరాబాదుకు సత్సంబంధాలు ఉన్నాయని, ఇస్లామిక్ రిపబ్లిక్ ఇరాన్ ప్రెసిడెంట్ డా. హసన్ రోహనీ హైదరాబాదులో పర్యటించడం విశేషం అని, వారిని స్వాగతించడం ఒక గొప్ప అవకాశమని అన్నారు.
హైదరాబాదు లోని ఇరాన్ కాన్సులేట్ జనరల్ శ్రీ మహమ్మద్ హఘ్ బిన్ ఘోమీ (Mohammad Haghbin Ghomi) మాట్లాడుతూ, తమ దేశాధ్యక్షుని పర్యటనకు తెలంగాణ ప్రభుత్వం అతితక్కువ సమయంలో ఏర్పాట్లు చేయడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేసారు. అధ్యక్షుని పర్యటనలో 21 మంది డెలిగేట్లు కూడా పాల్గొంటారని తెలిపారు. ఆయన తన పర్యటన సందర్భంగా హైదరాబాదు లో స్థిరపడ్డ ఇరానియన్ల తో సమావేశమౌతారని అన్నారు.
ఈ సమావేశంలో జి.ఎ.డి. ముఖ్య కార్యదర్శి శ్రీ అధర్ సిన్హా, నగర పొలిసు కమిషనర్ శ్రీ వి.వి. శ్రీనివాస రావు, మైనారిటీ సంక్షేమ శాఖ సెక్రటరీ శ్రీ దాన కిషోర్, హైదరాబాదు కలెక్టర్ శ్రీమతి యోగితా రాణా, ఇంటలిజెన్స్ ఐ.జి. శ్రీ నవీన్ చంద్, అడిషనల్ డి.జి. శ్రీ అంజనీ కుమార్, ప్రోటోకాల్ డైరెక్టర్ శ్రీ అర్విందర్ సింగ్, జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలిస్ శ్రీ రవీందర్, రీజినల్ పాస్ పోర్ట్ ఆఫీసర్ శ్రీ ఇ. విష్ణువర్ధన్ రెడ్డి, ఫైర్ సర్వీసెస్ డి.జి. శ్రీ రాజీవ్ రతన్, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.













