అందరికీ సాయం అందేలా చూడాలి – సిఎస్
హైదరాబాద్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆర్థిక సాయం పంపిణీపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సోమేశ్ కుమార్ మాట్లాడుతూ.. ఆర్థిక సాయం త్వరగా పంపిణీకి అధికారులు ప్రణాళిక రూపొందించడంతో పాటు బృందాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జీహెచ్ఎంసీలో 300, శివారు మున్సిపాలిటీల్లో 50 బృందాలను ఏర్పాటు చేయాలన్నారు. జీహెచ్ఎంసీ, సీడీఎంఏ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయాలని చెప్పారు. అవసరమైతే అధికారులను జిల్లాల నుంచి సమకూర్చుకోవాలని అధికారులను ఆదేశించారు. జీహెచ్ఎంసీలోని ప్రతి సర్కిల్లో పది బృందాలను ఏర్పాటు చేయాలని సోమేశ్ కుమార్ సూచించారు.













