వైఎస్ జగన్ తో కేటీఆర్ భేటీ
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డితో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీ అయ్యారు. లోటస్‌పాండ్‌లో గంటన్నరపాటు సుదీర్ఘంగా జరిగిన ఈ సమావేశంలో కేసీఆర్ సూచనల మేరకు ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు అంశంపై కేటీఆర్ వైఎస్ జగన్‌తో చర్చించారు. భేటీ అనంతరం వారిద్దరూ మీడియాతో మాట్లాడారు.
రాష్ట్రాల హక్కులు కాపాడాలంటే ఎక్కువసంఖ్యలో ఎంపీలు గళమెత్తాల్సిన అవసరముందని, ఈ క్రమంలో ఏపీకి చెందిన 25 మంది ఎంపీలకు తోడు తెలంగాణ ఎంపీలు 17 మంది కలిసివస్తే కేంద్ర ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెంచే అవకాశముంటుందని జగన్మోహన్రెడ్డి సృష్టం చేశారు. ప్రత్యేక హోదా కోసం ఎక్కువ ఎంపీల మద్దతు అవసరముందని, ఈ నేపథ్యంలో తెలంగాణ ఎంపీలు కలిసివస్తే, ఆంధ్రప్రదేశ్‌కు మరింత మేలు జరుగుతుందని ఆయన అన్నారు. కేసీఆర్ ఫోన్ చేసిన తర్వాత, కేటీఆర్ వచ్చి నాతో ఫెడరల్ ఫ్రంట్ అవసరం, రాష్ట్రాలకు కేంద్రం చేస్తున్న అన్యాయం, కేంద్రాన్ని ఎదుర్కోవాలంటే దేశ ర్యాప్తంగా రాష్ట్రాలు ఏకం కావాల్సిన అవసరం గురించి చర్చించారు. ప్రత్యేక హోదా విషయమే పరిశీలిస్తే పార్లమెంట్ వేదికగా ఇచ్చిన హామీకే దిక్కులేదు. హోదా విషయంపై మేం ఎంత పోరాడిన కేంద్రంలో కదిలిక లేదు. ఏపీకి చెందిన 25 ఎంపీలకు తోడుగా తెలంగాణకు చెందిన 17 మంది ఎంపీలు కలిస్తే కేంద్రంపై మరింత ఒత్తిడి పెరుగుతుంది. రాష్ట్రాల హక్కులు నిలబడాలంటే రాష్ట్రాల తరపున మాట్లాడేవారి సంఖ్య పెరగాలి. రాష్ట్రాల ప్రయోజనాల కోసం కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాన్ని స్వాగతిస్తున్నాం. ఇప్పుడు జరిగినవి ప్రాథమిక చర్చలు మాత్రమే. త్వరలోనే కేసీఆర్ కూడా వచ్చి కలుస్తామన్నారు. ఫెడరల్ ఫ్రంట్‌పై మరింతగా చర్చిస్తామన్నారు. కేటీఆర్‌తో చర్చించిన అంశాలపై పార్లీలో విస్తృతంగా చర్చిస్తాం అని తెలిపారు.
దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు కోసం ఏడాది కాలంగా సీఎం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని కేటీఆర్ తెలిపారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగానే జగన్‌తో భేటీ అయినట్లు తెలిపారు. జాతీయ స్థాయిలో సమాఖ్య స్ఫూర్తి కోసం కేసీఆర్ ప్రత్యామ్నాయం కోసం ప్రయత్నిస్తున్నారన్నారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగా పలువురు జాతీయ నేతలతో కేసీఆర్ ఇప్పటికే చర్చించారన్నారు. ఈ క్రమంలో భాగంగానే ఫెడరల్ ఫ్రంట్ ఆలోచనపై మాట్లాడేందుకు జగన్ వద్దకు వచ్చామన్నారు. ప్రజాకాంక్షకు అనుగుణంగా రాజకీయాలు ఉండాలి. త్వరలో ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లి అక్కడి నేతలతో కేసీఆర్ చర్చలు జరుపుతారని తెలిపారు. త్వరలో కేసీఆర్ స్వయంగా ఏపీకి వెళ్లి జగన్‌తో చర్చిస్తారని చెప్పారు. జగన్ తమతో కలిసి వస్తారని ఆశిస్తున్నట్లు తెలిపారు.
కేటీఆర్ వెంట ఎంపీలు వినోద్ కుమార్, సంతోష్ రావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రధాన కార్యదర్శులు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, శ్రావణ్‌కుమార్ రెడ్డి, జగన్‌తో పాటు వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, పార్థసారథి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఈ భేటీలో పాల్గొన్నారు.













