జీహెచ్ఎంసీ మనదే…
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టీఆర్ఎస్ 94 నుంచి 104 సీట్ల వరకు గెలుస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికలపై ఇప్పటికే నాలుగు సర్వేలు చేశామని, అన్ని సర్వేల్లో ఇదే విషయం తేలిందని చెప్పారు. హైదరాబాద్‌లో గత ఆరేండ్లలో మనం ఏం చేశామో ఆ పనులు చెప్పుకుంటే చాలన్నారు. దుబ్బాక ఉప ఎన్నికల్లోనూ టీఆర్ఎస్దే విజయమని చెప్పారు. తెలంగాణభవన్‌లో టీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ హైదరాబాద్ నగరంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, ఎమ్మెల్యేలు ఈ పనులను ప్రజలకు వివరించాలని సూచించారు.













