ఏ పార్టీతోనూ పొత్తులుండవు : కేసీఆర్
రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తులు ఉండవని, ఒంటరిగానే పోటీ చేస్తామని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ సృష్టం చేశారు. అసెంబ్లీ రద్దు తర్వాత ఏర్పాటు చేసిన తొలి మీడియా సమవేశంలో ఆయన మాట్లాడారు. 105 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. 100కు పైగా స్థానాలు గెలుస్తాం. టీఆర్ఎస్ సెక్యూలర్ పార్టీ. సెక్యులర్‌గానే ఉంటం. త్యాగాలు ఎవరైనా చేశారంటే అది తామే. త్యాగాలు చేసిన టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలకు సెల్యూట్. 82 నియోజకవర్గాల్లో 60 శాతం పైనా ఓట్లు వస్తాయి. 100 స్థానాల్లో 50 శాతం పైనా ఓట్లు వస్తాయి. ప్రతిపక్షాలన్నీ ఏకమైనా వందకు పైగా స్థానాలు గెలుస్తాం. ఏ రాష్ట్రంలోనైనా 20 ఎంపీ సీట్లు గెలుస్తమని కాంగ్రెస్ చెప్పగలదా? అని కేసీఆర్ ప్రశ్నించారు.













