తెలంగాణ భవన్‍లో సంబురాలు

తెలంగాణ భవన్‍లో టీఆర్‍ఎస్ శ్రేణులు సంబురాలు చేసుకున్నారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నిక విజయంతో ఆనందంతో డప్పులు వాయిస్తూ నృత్యాలు చేశారు. పెద్దఎత్తున బాణసంచా కాల్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ పనితీరుకు సాగర్ ఉప ఎన్నికల ఫలితం నిదర్శనమని, ప్రజలు అభివృద్ధికే పట్టం కట్టారని అన్నారు. విపక్షాల మాటలను ప్రజలు నమ్మలేదన్నారు. కార్పొరేషన్లు, పురపాలిక ఎన్నికల్లోనూ ఇలాంటి ఫలితాలే వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఫలితాలను చూసైనా బీజేపీ నేతలు బుద్ధి తెచ్చుకోవాలన్నారు. నోరు అదుపులో పెట్టుకోవాలని హితవు పలికారు. మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్ పాల్గొని మిఠాయిలు తినిపించుకున్నారు. ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎంపీ శ్రీనివాస్‍రెడ్డి, ఎమ్మెల్యే వెంకటేశ్వర్‍రెడ్డి, ఎమ్మెల్సీ శ్రీనివాస్‍రెడ్డి తదితరులు ఇందులో పాల్గొన్నారు.