తెలంగాణ భవన్లో సంబురాలు
తెలంగాణలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో టీఆర్ఎస్ విజయదుందుభి మోగించింది. దీంతో టీఆర్ఎస్ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్నారు. టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు తెలంగాణ భవన్కు భారీగా తరలివచ్చి ఆనందంతో నృత్యాలు చేశారు. జై కేటీఆర్, జై టీఆర్ఎస్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మంత్రి కేటీఆర్ తెలంగాణ భవన్ నుంచి ఎన్నికల ఫలితాలను తెలుసుకుంటున్నారు. తెలంగాణ భవన్లో ఎంపీలు, ఎమ్మెల్సీలతో సమావేశమైన కేటీఆర్ మేయర్, చైర్మన్ ఎన్నిక సందర్భంగా అనుసరించాల్సిన వ్యూహాలు, ఎక్స్ అపిషియో ఓటు వినియోగంపై చర్చించారు.













